News November 11, 2024
నారా లోకేశ్ చొరవతో రాజమండ్రికి చేరిన బాధితురాలు
రాజమండ్రికి చెందిన శిరీష అనే మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి ఇబ్బంది పడుతుందని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు ఎక్స్ వేదికగా విన్నవించారు. దీంతో స్పందించిన లోకేశ్ తనని తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను ఆదివారం స్వస్థలానికి తీసుకొచ్చినట్లు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో బాధితురాలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 7, 2024
ఈ నెల 10 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: తూ.గో కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
News December 6, 2024
కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష
కాకినాడలో 42 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. నిందితులను కాకినాడ మూడో స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వి.నరసింహారావు ముందు హాజరుపరిచారు. వారిలో 14 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. 28 మందికి రూ.10 వేలు చొప్పున రూ.2,80,000 జరిమానా వేశారు.
News December 6, 2024
ఇప్పుడు అంతటా కాకినాడే హాట్ టాపిక్
రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణా విషయం సంచలనం రేపుతోంది. సెజ్ భూములు, రేషన్ బియ్యం రవాణా, పోర్టు యజమానిపై బెదిరింపుల వంటి అంశాలు రోజుకు ఒకటి వెలుగుచూస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం పేరుతో వేల కోట్ల రూపాయలు పలువురు నేతలు దోచేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డీప్ వాటర్ పోర్టు, సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.