News December 20, 2024
నారా లోకేశ్ నవ శకం సభకు నేటితో ఏడాది పూర్తి

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు శుక్రవారంతో ఏడాది పూర్తి చేసుకుంది. భోగాపురం మండలంలోని పోలిపల్లి గ్రామంలో నవ శకం పేరిట ఇదే రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ అప్పట్లో ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రముఖులు హాజరయ్యారు. నేటితో ఏడాది పూర్తి కావడంతో టీడీపీ శ్రేణులు ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Similar News
News October 30, 2025
VZM: వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

TTDలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మాజీ TTD ఛైర్మన్ YV.సుబ్బారెడ్డి మాజీ PA అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపై సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో VZM (D) తెర్లాం (M)కి చెందిన అప్పన్నను అరెస్ట్ చేశారు.
News October 30, 2025
VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.
News October 29, 2025
VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


