News September 30, 2024
నారా లోకేష్‌ను కలిసిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి
విజయవాడలోని ఏపీ సచివాలయ ఛాంబర్‌లో మంత్రి నారా లోకేష్‌ను తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.
Similar News
News October 12, 2024
నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి: మంత్రి సవిత
చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో అత్తా-కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నవిత స్పందించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదని, వీలయినంత త్వరగా నిందితులను పట్టుకోవాలన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
News October 12, 2024
అనంతపురం జిల్లాలో 136 దుకాణాలకు 3144 దరఖాస్తులు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 136 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3144 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా విడపనకల్లులో 111వ దుకాణానికి 51 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా తాడిపత్రి పరిధిలో 16 దుకాణాలకు కేవలం 97 దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. అయితే అనంతపురం నగరంలో 30 దుకాణాలకు 1056 దరఖాస్తులు వచ్చాయి.
News October 12, 2024
విద్యార్థులందరికీ విజయాలు చేకూరాలి: మాజీ రిజిస్ట్రార్
జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ సీ.శశిధర్ విజయదశమి శుభాకంక్షాలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో విద్యార్థులందరికీ విజయాలు చేకూరాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసేలా జగన్మాత దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.