News April 29, 2024
నార్కట్ పల్లి: కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

బైకుని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన ఘటన నార్కట్ పల్లి మండలం ఓసీటీఎల్ వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండి.జానీ మియా ఏపీ లింగోటం నుంచి ఓసీటీఎల్ వైపు తన బైక్‌పై వస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. అతడు రోడ్డు పక్కకు పడడంతో తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
Similar News
News January 5, 2026
నల్గొండలో జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.
News January 5, 2026
NLG: గడువు మరో ఐదు రోజులే

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నా కా సహారా మిస్కీనో కే.లియే’ పథకాల కింద ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారు tgobm-m-r.c-f-f.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News January 4, 2026
రాష్ట్రస్థాయి హాకీలో నల్గొండ జట్టుకు మూడో స్థానం

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు సత్తా చాటింది. మూడో స్థానం కోసం నిజామాబాద్‌తో జరిగిన పోరులో 2-0 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. జట్టులోని రాకేష్, అఖిల్ నందన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచ్ యావర్‌ను డీఈఓ భిక్షపతి, డీవైఎస్‌ఓ అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హిమాం ఖరీం, ఎస్జీఎఫ్ కార్యదర్శి నర్సి రెడ్డి అభినందించారు.


