News April 29, 2024

నార్కట్ పల్లి: కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

బైకుని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి మరణించిన ఘటన నార్కట్ పల్లి మండలం ఓసీటీఎల్ వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎండి.జానీ మియా ఏపీ లింగోటం నుంచి ఓసీటీఎల్ వైపు తన బైక్‌పై వస్తుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. అతడు రోడ్డు పక్కకు పడడంతో తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు.

Similar News

News April 16, 2026

44.1 డిగ్రీలతో సెగలు గక్కుతున్న నల్గొండ

image

నల్గొండ జిల్లాలో ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. భానుడి భగభగలకు జిల్లా నిప్పుల కొలిమిలా మారగా, గుడిపల్లిలో అత్యధికంగా 44.1°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకొండ, కట్టంగూరు వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News April 16, 2026

NLG: రైతు భరోసాపై వీడని సందిగ్ధం

image

రైతు భరోసా రెండో విడత నిధుల జమపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 13 నుంచే నిధులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో మొదటి విడతగా ఎకరంన్నర లోపు భూమి ఉన్న రైతులకు రూ.268.57 కోట్లు జమ చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.12 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News April 16, 2026

కృష్ణ బోర్డు వ్యవహార శైలిపై లేఖ

image

కృష్ణా బోర్డు వ్యవహారశైలిపై ఇరిగేషన్ శాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జల వివాదాల పరిష్కారం బోర్డు బాధ్యతైనా, ఇటీవల రెండు రాష్ట్రాలు సమస్యలు తామే తేల్చుకోవాలని లేఖ రాయడం వివాదాస్పదమైంది. ఏపీకి అనుకూలంగా బోర్డు వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తుండగా, త్రీ మెంబర్ కమిటీ సమావేశాలు సకాలంలో జరపడం లేదని, టీజీ ప్రభుత్వమే నిధులు ఇస్తున్నా సరైన చర్యలు అధికారులు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాశారు.