News January 23, 2025
నార్నూర్: క్రీడలు ఆడుతూ విద్యార్థి మృతి

నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో క్రీడలు ఆడుతూ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. భీంపూర్ గ్రామానికి చెందిన బన్నీ పాఠశాలలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలో పాల్గొన్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడు. దీంతో స్పందించిన ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థిని నార్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News October 21, 2025
సూర్యాపేట: సలాం పోలీసన్నా..!

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరుల సేవలను స్మరించుకుంటూ నేడు(అక్టోబరు 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారు. 2003లో చింతలపాలెం వద్ద నక్సల్స్ మందుపాతర దాడిలో ముగ్గురు, 2007లో తిరుమలగిరి దాడిలో ఇద్దరు, 2015లో హైటెక్ బస్టాండ్ ఘటనలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు.
News October 21, 2025
తూర్పుగోదావరి జిల్లా నుంచి తొలి ఐపీఎస్ ఆయనే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన పీవీ రంగయ్య నాయుడు జిల్లా నుంచి ఐపీఎస్కు ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 21 ఏళ్లకే ఆయన ఐపీఎస్ కావడం గమనార్హం. డీజీపీగా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సేవలు అందించారు. సర్వీస్ అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర విద్యుత్, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.
News October 21, 2025
SRPT: ఠాణాపై దాడికి 17 ఏళ్లు.. ఇద్దరు పోలీసులు మృతి

తిరుమలగిరి ఠాణాపై నక్సల్స్ దాడి చేసి, ఇద్దరు పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 17 ఏళ్లు. 2007 జులై 7న సుమారు 40 మంది నక్సల్స్ ఠాణాపై దాడికి పాల్పడి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శ్రీరాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బడేసాబ్లపై కాల్పులు జరిపి వారిని చంపారు. అనంతరం స్టేషన్లో ఉన్న ఆయుధాలను అపహరించుకు పోయారు. ఆనాటి అమరవీరుల త్యాగాన్ని జిల్లా ప్రజలు స్మరించుకున్నారు.