News January 20, 2025
నార్నూర్ ఘాట్ రోడ్డు భద్రతపై ముందే హెచ్చరించిన Way2news

నార్నూర్ నుంచి మలంగి గ్రామానికి వెళ్లే దారిలో వచ్చే ఘాట్ రోడ్డు భద్రతపై Way2news ముందే హెచ్చరించింది. ఇటీవల రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉందని పలు కథనాలు ప్రచురించింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆదివారం ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రజలు Way2news కథనాలపై చర్చించుకున్నారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు.
Similar News
News October 27, 2025
తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.
News October 27, 2025
ADB: పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది: కలెక్టర్

పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచనాశక్తి, జ్ఞానం పెరుగుతాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్లో ‘పుస్తక పఠనం చేద్దాం’ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న విలువైన పుస్తకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
News October 26, 2025
కైలాష్ సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, వనవాసి కల్యాణ పరిషత్ అధికారి శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


