News January 23, 2025
నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా అంబులెన్స్ సహకారంతో రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామనికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
Similar News
News November 6, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.
News November 6, 2025
ఇవాళ అమరావతికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ కానున్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
News November 6, 2025
సిద్దిపేటలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలో ఈ నెల 7న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో పలు ఖాళీ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.


