News January 23, 2025
నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా వారు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామనికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
Similar News
News October 30, 2025
రేపు వనపర్తిలో 2కే రన్: కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని 2కే రన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరుగు పాలిటెక్నిక్ కళాశాల వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ రన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News October 30, 2025
ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

ముంబై <<18151381>>కిడ్నాప్ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్‌తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్‌పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్ చనిపోయాడు.
News October 30, 2025
మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం: మున్నేరు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 28 అడుగుల మార్కును దాటడంతో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సాయంత్రం కలెక్టర్, సీపీతో కలిసి నదిని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, తగిన సమీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సహా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


