News January 23, 2025
నార్నూర్ ప్రమాద ఘటనలో మరొకరు మృతి

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం ఆదివారం అదుపు తప్పిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలు కాగా వారు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, తాజాగా ఇంద్రవెల్లి మండలం చిత్తగూడ గ్రామానికి చెందిన ఆత్రం మల్కుబాయి (55) హైదరాబాద్లో బుధవారం సాయంత్రం మరణించారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
Similar News
News November 23, 2025
అమెరికా వీసా రిజెక్ట్.. HYDలో డాక్టర్ సూసైడ్

అమెరికా J1 వీసా రాలేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. గుంటూరుకి చెందిన డాక్టర్ రోహిణి కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం ఇటీవల వీసాకు అప్లై చేయగా.. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కలత చెందిన రోహిణి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుంటూరులోని సొంత నివాసానికి తరలించారు.
News November 23, 2025
పాల్వంచ ఆర్గానిక్ ఫుడ్ తయారీ కేంద్రం పరిశీలన

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకంలో విపత్తు ప్రణాళిక హ్యాండ్బుక్ రూపకల్పనకు ఇండియా హౌస్ బృందం పాల్వంచ పేటచెరువులోని చరిత ఆర్గానిక్ ఫుడ్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్గానిక్ ఫుడ్లో సేంద్రియ ఉత్పత్తుల ప్రత్యేకత, తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ కలెక్టర్ సుజాత్నగర్లోని రవి హైబ్రిడ్ సీడ్స్ విత్తన పరిశోధనా కేంద్రాన్ని కూడా సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
News November 23, 2025
వేములవాడ: కోడె మొక్కు చెల్లించుకున్న 3,356 మంది

వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో కోడె మొక్కు చెల్లించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 3,356 మంది కోడె మొక్కు చెల్లించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. 48 కళ్యాణం, 48 అభిషేకం, 35 అన్నపూజ, 14 కుంకుమ పూజ టికెట్లు విక్రయించినట్లు వారు వివరించారు.


