News November 20, 2024
నార్నూర్: సీసీ కెమెరాలో చిక్కిన పెద్దపులి
నార్నూర్ మండలంలోని చోర్గావ్ గ్రామ శివారులో తార్యానాయక్ అనే రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. కాగా పెద్దపులి ఆవు పై దాడి చేసిన ప్రదేశంలో అటవీశాఖ అధికారులు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఆ సీసీ కెమెరాలో పెద్దపులి దృశ్యాలు రికార్డయ్యాయి.
Similar News
News December 2, 2024
నృత్య ప్రదర్శనలో నిర్మల్ చిన్నారుల ప్రతిభ
నిర్మల్ జిల్లా శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలను పొందారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.
News December 2, 2024
నిర్మల్: ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు
ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆదివారం సోన్‌లో మిరుమిట్లు గొలిపే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్టేషన్‌ను అలంకరించారు. కాగా ఈ నెల 9 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 1, 2024
లక్షెట్టిపేటలో సీఎం ప్రసంగాన్ని విన్న ఎమ్మెల్యే, కలెక్టర్
లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్‌గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు.