News May 26, 2024

నార్పల: రైతుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

నార్పల మండలం జంగమరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో రైతుల మధ్య ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందారు. అతడు ఇటీవల నూతన బోరు వేయించాడు. మోటార్ ఆమర్చడానికి వెళ్లిన సమయంలో తుంపెర గ్రామస్థులతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కిందపడగా వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News February 12, 2025

‘ఉద్యాన పంటల సాగు పెంపునకు కృషి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 12, 2025

అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

image

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.

News February 12, 2025

అనంత: టెన్త్ అర్హతతో 66 ఉద్యోగాలు

image

అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!