News February 7, 2025
నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్‌షా కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
HYD: మీలాంటి వ్యక్తి మీ కూతురుకి భర్తగా వస్తే?

HYDలో 3 ముళ్ల బంధాలు మున్నాళ్ల ముచ్చటవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. నిపుణుల సలహా ఏంటంటే.. మీ కూతురుకి మీలాంటి లక్షణాలున్న వ్యక్తి భర్తగా వస్తే అంగీకరిస్తారా? అలాగే స్త్రీలూ మీ అబ్బాయికి మీలాంటి వ్యక్తి భార్యగా వస్తే అంగీకరిస్తారా? అంగీకరించలేకుంటే అలా మిమ్మల్ని మార్చుకుంటే బంధాలు నిలబడతాయి. యువత ఆత్మపరిశీలన చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని సూచిస్తున్నారు.
News February 14, 2026
HYD: అత్తపై అత్యాచారం.. అల్లుడికి 10ఏళ్ల జైలు

నాచారం PS పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి కుషాయిగూడ సెషన్స్ న్యాయస్థానం శిక్ష విధించింది. 2022లో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు రమేశ్(38)కి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అప్పటి ఇన్‌స్పెక్టర్ మహేశ్ పకడ్బందీగా సాక్ష్యాలు సమర్పించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.
News February 14, 2026
HYD: 3 నెలల్లో ఫుట్‌పాత్‌లు క్లియర్!

పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని TG హైకోర్టు GHMCని ఆదేశించింది. HYDలో ఉన్న ఫుట్‌పాత్‌లను 3 నెలలోగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాటసారులకు ఆటంకం కలిగిస్తున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టంచేసింది.


