News April 8, 2025
నార్సింగి : భర్తతో గొడవ భార్య ఆత్మహత్య

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News September 17, 2025
GWL: కలెక్టరేట్లో ప్రోటోకాల్ రగడ

గద్వాల కలెక్టరేట్లో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. కార్యక్రమ వేదికపైకి గద్వాల మార్కెట్ ఛైర్మన్‌ను ఆహ్వానించి, జిల్లా లైబ్రరీ ఛైర్మన్, అలంపూర్ మార్కెట్ ఛైర్మన్లను పిలవకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైకి వెళ్లిన వారిని పోలీసులు కిందికి తీసుకువచ్చారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలతో వారిని తిరిగి వేదికపై కూర్చోబెట్టడంతో వివాదం సద్దుమణిగింది.
News September 17, 2025
విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
సూర్యాపేట-గరిడేపల్లి హైవేపై యాక్సిడెంట్

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీవీఎస్ ఎక్సెల్‌పై ప్రయాణిస్తుండగా సూర్యాపేట-గరిడేపల్లి రహదారిపై లారీ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.