News March 19, 2024
నార్సింగి: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే యువకుడు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయడం లేదు. దీంతో అతని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో విరక్తి చెందిన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై తెలిపారు.
Similar News
News April 11, 2025
మెదక్: చికిత్స పొందుతూ రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 10, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
News April 10, 2025
మెదక్: కొడుకు పెళ్లి.. అంతలోనే విషాదం

మెదక్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు శుభకార్యం.. మరొకవైపు చావు కబురు ఆ కుటుంబాన్ని కలచివేసింది.