News March 4, 2025
నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడుది విజయనగరంలోని బాబామెట్ట. 1996లో చాకలిపేట పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. పదేళ్ల సర్వీసు అనంతరం 2006లో జాబ్కు రిజైన్ చేశారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఓడిపోయిన ఆయన.. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు.
Similar News
News November 13, 2025
కామారెడ్డి: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు శిక్షణ

కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గురువారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యవసాయ రంగంలో సమూహ బలం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
News November 13, 2025
ఈ నెల 14న 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు

వనపర్తిలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జి గోవర్ధన్, కార్యదర్శి బి.వెంకటయ్య తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు సాగే వారోత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభిస్తారన్నారు. విద్యార్థిని, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
News November 13, 2025
MHBD: బీసీ విద్యార్థులకు ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ-పాస్ వెబ్సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


