News March 4, 2025

నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేశారు. విజయనగరానికి చెందిన గాదె 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు.

Similar News

News December 4, 2025

పంచాయతీ ఎన్నికల దశలో నాయకత్వ లోపం..!

image

WGL: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దశలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీలో నాయకత్వ లోపంపై విమర్శలు చెలరేగుతున్నాయి. 2022లో నియమించిన జిల్లా అధ్యక్షులే కొనసాగుతుండగా, కొత్త కమిటీలపై అధిష్ఠానం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కేడర్‌లో ఉంది. జనగామ అధ్యక్షుడు కన్నుమూసినా, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసినా ఇప్పటికీ స్థానభర్తీ లేకపోవడం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

News December 4, 2025

WGL: సోషల్ మీడియానే మొదటి ప్రచార అస్త్రం..!

image

ఉమ్మడి ఓరుగల్లులో జీపీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. దేవాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు, ఇళ్ల పంపిణీ, శుద్ధి నీటి సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, చమత్కార స్లోగన్లు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది.

News December 4, 2025

HYD: వెల్డింగ్ ట్రైనింగ్.. సర్టిఫికెట్

image

మాదాపూర్‌ NAC- జాతీయ భవన నిర్మాణ సంస్థలో ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్‌గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజులపాటు రూ.15,000 ఫీజుతో శిక్షణ ఇస్తారు. భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉద్యోగం లేనివారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు. వారికి నెలకు రూ.6,000కు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.