News March 4, 2025
నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేశారు. విజయనగరానికి చెందిన గాదె 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు.
Similar News
News November 23, 2025
ఆన్లైన్లో అర్జీలు సమర్పించండి: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్కు అర్జీలకు మీ కోసం వెబ్సైట్లో కూడా నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వెల్లడించారు. అర్జీల సమాచారం కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
News November 23, 2025
ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్‌కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్‌లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.
News November 23, 2025
ఆరోగ్య ప్రమాణాలు మెరుగవ్వాలి: కలెక్టర్

అన్నమయ్య జిల్లాను ఆరోగ్య ప్రమాణాల్లో అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. PGRS సమావేశంలో ANC కేసుల రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్, మలేరియా–డెంగ్యూ నియంత్రణపై సమీక్షించారు. ప్రసూతి మరణాలు జరగకుండా PHCల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మందులు సకాలంలో అందించాలని సూచించారు. ANMలు, ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.


