News March 4, 2025
నాలుగుసార్లు పోటీ.. మూడుసార్లు విజయం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడుది విజయనగరంలోని బాబామెట్ట. 1996లో చాకలిపేట పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. పదేళ్ల సర్వీసు అనంతరం 2006లో జాబ్‌కు రిజైన్ చేశారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన అనంతరం టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు. 2013లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఓడిపోయిన ఆయన.. తాజాగా జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు.
Similar News
News February 9, 2026
కరీంనగర్: పదవి కోసం అభ్యర్థుల తంటాలు

ఉమ్మడి KNR జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పలు డివిజన్ల, వార్డుల్లో ఎక్కువ మంది పోటీలో ఉండటంతో, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు, ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News February 9, 2026
రూ.20కే గోధుమ పిండి.. పంపిణీ షురూ

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.
News February 9, 2026
ఆకాశంలో టాక్సీలు.. బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్: CII ప్రతిపాదన

గురుగ్రామ్, నోయిడా ఎయిర్‌పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్‌లను కలుపుతూ ఈ నెట్‌వర్క్ రాబోతోంది.


