News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి

నల్లగొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన మెండే ప్రేమ్ – సునీతల కుమారుడు మెండే ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.
Similar News
News October 27, 2025
నల్గొండలో 85% ధాన్యం కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. దేవరకొండ, చండూరు డివిజన్లలో వరికోతలు ఆలస్యం కావడంతో, మిగిలిన కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. HYD నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కలెక్టర్ ఈ వివరాలు తెలిపారు.
News October 27, 2025
బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 27, 2025
NLG: మైనర్‌పై అత్యాచారయత్నం.. నిందితుడికి పదేళ్ల జైలు

మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ నల్గొండ ఎస్సీ/ఎస్టీ, పోక్సో కేసుల కోర్టు తీర్పు వెలువరించిందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. తిప్పర్తి మండలం కేసరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుకు ఈ శిక్ష పడింది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.


