News November 17, 2024

నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి  

image

నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.

Similar News

News November 1, 2025

చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

News November 1, 2025

NLG: ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.

News November 1, 2025

మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

image

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.