News May 2, 2024

నాలుగు, ఐదు తేదీల్లో హోమ్ ఓటింగ్: కలెక్టర్

image

ఈ నెల 4, 5తేదీలలో హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన 181 మంది వృద్ధులు, 258 మంది వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 25 ప్రత్యేక హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేసి, 12 రూట్ల ద్వారా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు.

Similar News

News January 13, 2025

NZB: ఊరు వాడా ఘనంగా భోగి సంబురం

image

ఉమ్మడి NZB జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇండ్ల ముందు యువతులు, చిన్నారులు రంగు రంగుల ముగ్గులు వేస్తూ..సందడి చేశారు. అటు యువకులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి పటాలు ఎగురవేస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు.

News January 13, 2025

NZB: ఇద్దరు మహిళలు సూసైడ్ అటెంప్ట్.. కాపాడిన పోలీసులు

image

బాసర గోదావరిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన మహిళతో పాటు మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా చెందిన మరో మహిళ గోదావరిలో దూకేందుకు యత్నించగా పోలీసులు కాపాడారు. NZBకు చెందిన మహిళా కుటుంబ సభ్యులతో గొడవపడి గోదావరిలో దూకేందుకు యత్నించగా అటుగా వెళ్తున్న ఎస్సై ఆమెను అడ్డుకున్నారు. నాందేడ్ కు చెందిన మహిళను మహిళ కానిస్టేబుల్ అడ్డుకున్నారు.

News January 13, 2025

మోపాల్: కారు – బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

ఆదివారం కారు- బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మోపాల్ SI యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గం(P) సంజీవరెడ్డికాలనీకి చెందిన విజయ్ కుమార్(48) మోపాల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.