News March 6, 2025
నాలుగు లాడ్జీలలో ఎంట్రీ రిజిస్టర్లు చోరీ

భద్రాచలం పట్టణంలోని ఉన్న ఓ నాలుగు లాడ్జీలలోఎంట్రీ రిజిస్టర్లను గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు. గత ఏడాది డిసెంబర్ 25న కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకోగా, సదరు లాడ్జీల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో బుధవారం తెల్లవారుజామున లాడ్జీ రిసెప్షన్లో ఉండాల్సిన రిజిస్టర్లు చోరీకి గురవడంతో యజమానులు కంగుతిని, ఇదే విషయమై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.

విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సకు ‘లినాక్’ పరికరం

విజయవాడ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా లీనియర్ యాక్సిలరేటర్ పరికరాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ అత్యాధునిక ‘లినాక్’ పరికరం సమకూర్చేందుకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.