News March 6, 2025
నాలుగు లాడ్జీలలో ఎంట్రీ రిజిస్టర్లు చోరీ

భద్రాచలం పట్టణంలోని ఉన్న ఓ నాలుగు లాడ్జీలలోఎంట్రీ రిజిస్టర్‌లను గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు. గత ఏడాది డిసెంబర్ 25న కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకోగా, సదరు లాడ్జీల యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో బుధవారం తెల్లవారుజామున లాడ్జీ రిసెప్షన్‌లో ఉండాల్సిన రిజిస్టర్లు చోరీకి గురవడంతో యజమానులు కంగుతిని, ఇదే విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 20, 2025
ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్.. మూడ్రోజులు వర్షాలు

రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News March 20, 2025
మేం ఆదేశిస్తే పోలీసులు కేటీఆర్‌ను వంగబెట్టి దంచరా?: సీఎం రేవంత్

TG: తనకు పరిపాలనపై పట్టు రాలేదని BRS చేస్తున్న విమర్శలపై CM రేవంత్ మండిపడ్డారు. ‘వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా. ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలుకొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే KTR తలుపులు పగులకొట్టి వంగబెట్టి దంచరా? కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం. సచివాలయానికే రాని మీకు పట్టు ఉందా? రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్న నాకు, మా సీతక్కకు పరిపాలనపై పట్టు లేదా?’ అని ప్రశ్నించారు.