News March 17, 2025
నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడి

పాల్వంచలో దారుణం జరిగింది. పొలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన శివకుమార్ నాలుగో తరగతి చదివే ఓ బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. డాబా పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. కాగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 9, 2025
తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి

తిరుపతి(D) నారాయణవనం మండలంలో విషాద ఘటన జరిగింది. నగరి(ఛ) గుండ్రాజుకుప్పానికి చెందిన గుణశేఖర్(42) తిరువట్యంలో జరిగిన బంధువుల దహనక్రియలకు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా తిరువట్యం కాజ్వే వద్ద నారాయణవనం రజక కాలనీకి చెందిన అంకమ్మ(72) బట్టలు ఉతుకుతూ నదిలో పడిపోవడాన్ని ఆయన గుర్తించారు. ఆమెను కాపాడడానికి గుణశేఖర్ నదిలోకి దూకారు. ఈత రాకపోవడంతో వృద్ధురాలితో పాటు అతనూ నీట మునిగి చనిపోయారు.
News December 9, 2025
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్

మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. మొదటి దశ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అబ్జర్వర్లతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
News December 9, 2025
ఇదీ సంగతి: ఫోన్పే కొట్టు.. ఓటు పట్టు!

TG: రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రలోభాలకు తెరలేపారు. గ్రామంలో ఉన్న ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతుండగా వలస ఓట్లపైనా దృష్టి పెట్టారు. వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే వంటి UPI పేమెంట్స్ ద్వారా డబ్బులు పంపుతున్నారు. ఓటుకు రేట్ కట్టడంతో పాటు రానుపోను దారి ఖర్చులకు ‘Pay’ చేస్తున్నారు.


