News December 7, 2024
నాలెడ్జ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం

సాంకేతికత అభివృద్ధికి దోహద పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్‌లో సీఎం పాల్గొన్నారు.1996లో ఐటీ గురించి మాట్లాడిన తను ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకొకసారి డీప్ టెక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 9, 2025
విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
విశాఖ కలెక్టరేట్లో రేపు జరగబోయే PGRS రద్దు

విశాఖ కలెక్టరేట్లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
News November 9, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


