News February 27, 2026

నాసా పరీక్షలో పులివెందుల చిన్నారి సత్తా

image

ఇటీవల నిర్వహించిన నాసా (ఎన్‌ఏఎస్ఓ) పరీక్షలో పులివెందుల విద్యార్థిని మెహరీన్ అంజు ప్రతిభను చాటుకుంది. రెండో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంకు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంతటి ప్రతిభ కనబరిచిన మెహరీన్ అంజు విజయానికి ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకంగా మారాయి. మహమ్మద్ రఫీ కుమార్తె అయిన మెహరీన్ అంజుకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

Similar News

News April 18, 2026

KNR: నేడు ఎలగందల్ కోటలో ఉచిత ప్రవేశం

image

కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల్ కోటను సందర్శించాలని భావిస్తున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేడు కోటను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని కోటను సందర్శించుకోవాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. ఎలగందల్ కోట తన వైభవమైన చరిత్ర, అద్భుత నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందింది.

News April 18, 2026

GNT: ముందస్తు పన్ను చెల్లింపులకు విశేష స్పందన!

image

ఈ నెలాఖరులోగా ముందస్తు ఆస్తిపన్ను కడితే 5% రాయితీ ఇస్తుండటంతో మంచి స్పందన వస్తోంది. అధికారులు ముమ్మర ప్రచారం చేస్తుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. కేవలం 9 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. 41.10 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో గుంటూరులో రూ. 32.29 కోట్లు, పల్నాడులో రూ. 5.52 కోట్లు, బాపట్లలో రూ. 2.51 కోట్లు జమ అయ్యాయి. ఈ నెలాఖరుకు వసూళ్లు మరింత పెరగనున్నాయి.

News April 18, 2026

శాతవాహన వర్సిటీలో ‘ఈసీ’ లొల్లి.. వీసీ తీరుపై నిరసన జ్వాలలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం ఈసీ సభ్యుల నామినేషన్‌పై వివాదం నెలకొంది. వీసీ ప్రొ.ఉమేష్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సూచనల మేరకే సభ్యులను ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి, వీసీ, మంత్రికి అత్యంత ఇష్టమైన వ్యక్తులను నామినేట్ చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై నియామకాలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.