News March 12, 2025
‘నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు నాన్న’

సోమందేపల్లి మం. పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చుదువుతున్న విద్యార్థిని పూజిత(15) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందించారు. నిన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక ‘నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు’ అని లేఖ రాసి ఉరేసుకుంది. చదువులో ముందున్న బాలిక బలవనర్మరణానికి పాల్పడంతో విషాదం నెలకొంది.
Similar News
News March 25, 2025
నాకోసం యువీ ఎండలో నిలబడేవారు: KKR డేంజరస్ బ్యాటర్

తన బ్యాటింగ్ స్కిల్ మెరుగవ్వడంలో ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ పాత్ర ఉందని KKR యువ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్ అన్నారు. ఆయనలా బ్యాటింగ్ చేయాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ‘యువీ కొన్నిసార్లు తన ప్రాక్టీస్ వదిలి నేను ప్రాక్టీస్ చేసే PCA స్టేడియం వచ్చేవారు. కొన్నిసార్లు అంపైర్ ప్లేస్‌లో ఎండలో నిలబడి గంటల కొద్దీ వీడియోలు రికార్డు చేసేవారు. వాటిని ఇంటికెళ్లి విశ్లేషించి నాకు సలహాలు ఇచ్చేవారు’ అని తెలిపారు.
News March 25, 2025
BREAKING: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని శాంతినగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
రన్యారావు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 27న తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. న్యాయస్థానంలో వాదనల సమయంలో నటి బెయిల్‌ను DRI వ్యతిరేకించింది. ఆమె నేరం ఒప్పుకున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారని కోర్టుకు తెలిపింది. అలాగే బంగారం కొనుగోలు కోసం హవాలా మార్గాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు వెల్లడించింది.