News April 18, 2024
నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.
Similar News
News October 23, 2025
పోచారం కాల్పులు.. రౌడీషీటర్ ఇబ్రహీం అరెస్ట్

పోచారం కాల్పుల ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. CP సుధీర్ బాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నాయి. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. తరచూ తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని కక్ష పెంచుకున్న ఇబ్రహీం, అతడి స్నేహితులు సోను మర్డర్‌కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నిన్న <<18078700>>యంనంపేట్<<>>లోని కిట్టి స్టీల్ వద్ద అతడిపై కాల్పులు జరిపారు.
News October 23, 2025
BREAKING: జూబ్లీహిల్స్‌లో 130 మంది అభ్యర్థులు రిజెక్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా కీలకమైన నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. పలు కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. 81 మంది నామినేషన్లను మాత్రమే యాక్సెప్ట్ చేశారు. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో 186 సెట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం గమనార్హం. రేపు అభ్యర్థుల ఉపసంహరణకు అవకాశం ఉంది.
News October 23, 2025
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.