News February 16, 2025
నా పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.
Similar News
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికలైనా ఆగని జంపింగ్లు

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి. బూత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు కనిపించగా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కమలం తన బలాన్ని ప్రదర్శించింది. అయితే సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు నిధుల కోసం అధికార కాంగ్రెస్లోకి చేరుతున్నారు. ఇదిలా ఉండగా స్వతంత్రులు, మరికొందరు సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటే అందులోకి చేరి తమదైన గుర్తింపు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 18, 2025
ఆదిలాబాద్: ప్రమాణ స్వీకార పత్రం ఇదే..!

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇటీవల పంచాయతీ రాజ్ ఈనెల 20న ప్రమాణ స్వీకారానికి ఇచ్చిన తేదీని 22న మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణానికి పత్రం విడుదల చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం గెలుపొందిన వారు సిద్ధంగా ఉన్నారు.
News December 18, 2025
ఆదిలాబాద్: స్కూలు వేళల్లో మార్పు

చలి తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం ఉదయం 9:40 గంటల- సాయంత్రం 4:30గం. వరకు పాఠశాలలు కొనసాగుతాయన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.


