News February 16, 2025
నా పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.
Similar News
News November 28, 2025
తానా బాల సాహిత్య భేరి-2025కు ఖమ్మం విద్యార్థిని ఎంపిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నవంబర్ 30న ఆన్లైన్లో నిర్వహించే అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనానికి ఖమ్మం, ఎన్ఎస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కొల్లి చంద్రిక ఎంపికైంది. కథ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 101 మంది బాల రచయితలతోపాటు చంద్రిక పాల్గొంటుంది. ఈ అరుదైన అవకాశం లభించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
News November 28, 2025
BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో భారీగా ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తును ఇ- మెయిల్ ద్వారా careers@bobcaps.inకు పంపాలి. వెబ్సైట్: https://www.bobcaps.in/
News November 28, 2025
ఈ పురుగు యమ డేంజర్.. కుడితే అంతే..

AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరియంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, మెదడు, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్ఫెక్షన్ సోకుతాయి.


