News March 26, 2025

నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు: గద్వాల MLA

image

తాను <<15888413>>BRSలోనే ఉన్నానని<<>> గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు మోసపూరితంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరానని ప్రచారం చేయడంతో ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కథనాలపై 2025, FEB 11న గద్వాల PSలో ఫిర్యాదు చేయగా FIR కూడా నమోదైందన్నారు.

Similar News

News April 2, 2025

ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

image

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

News April 2, 2025

బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 2, 2025

MBNR: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

image

ఎస్ఎల్​బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.

error: Content is protected !!