News March 26, 2025
నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు: గద్వాల MLA

తాను <<15888413>>BRSలోనే ఉన్నానని<<>> గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని వారు మోసపూరితంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాంగ్రెస్‌లో తాను చేరానని ప్రచారం చేయడంతో ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మీడియాలో వచ్చిన కథనాలపై 2025, FEB 11న గద్వాల PSలో ఫిర్యాదు చేయగా FIR కూడా నమోదైందన్నారు.
Similar News
News April 18, 2025
ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.
News April 18, 2025
గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

ఆన్‌లైన్ బెట్టింగ్ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.
News April 18, 2025
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <