News June 30, 2024

నా మొదటి నెల జీతం దానికే: విజయనగరం ఎంపీ

image

అన్ని అలవెన్సులతో తనకు వచ్చే మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు అందజేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన.. స్వామి సన్నిధిలో ప్రకటించారు. ఆంధ్రుడిగా బాధ్యతతో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి తన వంతుగా మొదటి జీతాన్ని అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

Similar News

News October 30, 2025

VZM: వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

image

TTDలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మాజీ TTD ఛైర్మన్ YV.సుబ్బారెడ్డి మాజీ PA అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపై సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో VZM (D) తెర్లాం (M)కి చెందిన అప్పన్నను అరెస్ట్ చేశారు.

News October 30, 2025

VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

image

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.

News October 29, 2025

VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

image

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.