News August 7, 2024
నా సొంత డబ్బులు రైతులకు కట్టా: ఎంపీ

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పుంగనూరు ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ నిర్మాణంలో రైతులు నష్టపోకుండా తమ సొంత నిధులు రూ.1.49 కోట్లను నష్టపరిహారంగా చెల్లించామని గుర్తించారు. టీడీపీ కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకుందన్నారు.
Similar News
News November 22, 2025
పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.
News November 22, 2025
GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.
News November 21, 2025
చిత్తూరు: పేదరికాన్ని జయించినా.. విధిని ఓడించలేక.!

అసలే పేదరికం.. మరోవైపు తల్లిలేని లోటు. అయినా ఆమె పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. ఓ వైపు నాన్నకు తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ <<18347620>>కష్టాల కడలి<<>>ని దాటి MLHP ఉద్యోగం సంపాదించింది ఆదిలక్ష్మి. పెళ్లి చేసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ విధికి ఇది నచ్చలేదోమో. ఆమె బిడ్డ రూపంలో మరోసారి పరీక్షించింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్న ఆమె కూతురి విషయంలో కలత చెంది ఆత్మహత్య చేసుకుంది.


