News April 25, 2024
నా 25 ఏళ్ల శ్రమ ఫలించింది: చామల

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఫామ్ తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో అందజేశారు. తన 25 ఏళ్ల కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. ఎంపీగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాడతానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు.
Similar News
News January 23, 2026
నల్గొండ మీదుగా ‘అమృత్ భారత్’ రైలు

నల్గొండ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్, 8స్లీపర్ కోచ్‌లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
News January 23, 2026
NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్ కిట్లను పంపిణీ చేసారు.
News January 23, 2026
నల్గొండ : M.B.A , M.C.A ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల..

ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ ,ఎంసీఏ సెమిస్టర్-1 రెగ్యులర్ కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్. ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 23 మధ్య పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత కళాశాలలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.


