News August 8, 2024

నిండుకుండలా నాగార్జున సాగర్

image

శ్రీశైలం ప్రాజెక్టుకి వరద కొనసాగుతుండటంతో బుధవారం 10 గేట్లను ఎత్తి 3,09,890 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 64,768 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోకి 2,95,919 కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ నుంచి 18 గేట్ల ద్వారా 2,49,300 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.50 అడుగులుగా ఉంది.

Similar News

News October 15, 2025

పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

image

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.

News October 15, 2025

నల్గొండ: బాలికపై అత్యాచారం.. ఏడేళ్ల జైలు శిక్ష

image

నల్గొండలో మైనర్‌పై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉప్పల నాగార్జునకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు చెప్పారు. 2019లో మోతే పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

News October 15, 2025

NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

image

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.