News August 8, 2024
నిండుకుండలా నాగార్జున సాగర్
శ్రీశైలం ప్రాజెక్టుకి వరద కొనసాగుతుండటంతో బుధవారం 10 గేట్లను ఎత్తి 3,09,890 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 64,768 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోకి 2,95,919 కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ నుంచి 18 గేట్ల ద్వారా 2,49,300 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 584.50 అడుగులుగా ఉంది.
Similar News
News September 10, 2024
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్
NLG: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్ సూచనలు చేస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని అన్నారు.
News September 9, 2024
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. హలియాకు చెందిన కృపారాణి అనే మహిళ ప్రసవం కోసం ఈ నెల 4న ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం 5 రోజులు వేచి చూశారు. దీంతో కడుపులోనే శివువు మృతి చెందిందని భాదితులు ఆరోపించారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
News September 9, 2024
NLG: రూ.10లక్షలు గెలిచే ఛాన్స్
RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. గెలిస్తే రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19నుంచి 21 వరకు ఉ.9 నుంచి రా.9గం.వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో మొత్తం 50కి పైగా కళాశాలలు ఉన్నాయి. 15వేల మందికిపైగా చదువుకుంటున్నారు.