News March 25, 2025

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

image

హైదరాబాద్‌లో 23 ఏళ్ల యువతి వేధింపుల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకి గాయాల పాలైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలో మహిళల భద్రతను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ఈ సంఘటన ఎత్తి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Similar News

News December 5, 2025

నిర్మల్: రోడ్ల గుంతల కోసం క్యూఆర్ కోడ్.. కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్

image

నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల మరమ్మతు కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతల ఫోటోలను పూర్తి వివరాలతో సహా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులకు పంపవచ్చు. సమాచారం ఆధారంగా గుంతలను తక్షణమే పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గుంతలు లేని రోడ్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

News December 5, 2025

వనపర్తి: 451 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు..!

image

జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 806 వార్డులకు గురువారం మొత్తం 451 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 70 నామినేషన్లు.
✓ పానగల్ – 123 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 117 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 70 నామినేషన్లు.
✓ వీపనగండ్ల – 71 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం వార్డు సభ్యుల నామినేషన్లు 490కి చేరింది.

News December 5, 2025

పర్వతగిరి: అభ్యర్థులంతా ఉద్యోగుల కుటుంబ సభ్యులే..!

image

పర్వతగిరి మండలంలోని బూర్గుమల్ల గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఆసక్తికర ఘటన నెలకొంది. ఆ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సహా పలువురు వార్డు సభ్యుల అభ్యర్థులు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. ఒకరు ఎస్సై తల్లి అయితే మరొకరు కార్యదర్శి అమ్మ. ఒకరు జీపీవో, కార్యదర్శిల నాన్న. మరొకరు స్కూల్ అటెండర్ అత్త అయితే ఇంకొకరు అటెండర్ భర్త. మరొకరు అంగన్వాడీ టీచర్ కుమార్తె. దీంతో గ్రామంలో చర్చ నడుస్తోంది.