News April 3, 2025

నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలి: ఎస్పీ మహేశ్

image

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషిచేయాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సబ్ డివిజన్ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News April 25, 2025

మొదటి సిక్స్ ప్యాక్‌ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

image

తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట హీరోల మధ్య వివాదం నెలకొంది. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది సూర్య అని ఆయన తండ్రి శివకుమార్ ఓ కార్యక్రమంలో అన్నారు. అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు. దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. ఆ తర్వాత ‘సత్యం’ కోసం నేను చేశాను’ అని గుర్తుచేశారు. ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.

News April 25, 2025

నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

image

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు. 

News April 25, 2025

భూ సమస్యల సత్వర పరిష్కారానికే భూ భారతి: SRPT కలెక్టర్

image

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మునగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.

error: Content is protected !!