News August 7, 2024

నిందితులకు శిక్ష పడాల్సిందే: మెదక్ SP

image

నిందితులకు శిక్షపడేలా కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది కృషి చేయాలని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందికి DGP నిన్న ప్రశంసా పత్రాలు అందజేశారు. SP మాట్లాడుతూ.. 2023లో హత్య కేసులో రామాయంపేట CI చంద్రశేఖర్, 2021లో మరో కేసులో తూప్రాన్ DSP కిరణ్ కుమార్.. నిందితులకు శిక్ష పడేలా చేశారు. నేర రహిత సమాజం కోసం నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పనిచేయాలన్నారు.

Similar News

News September 10, 2024

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

లక్ష్మీబాయి రక్ష ప్రశిక్షణ పేరుతో పాఠశాలలో అమలు చేయనున్న కరాటే శిక్షణ కోసం ఈనెల 16 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎంపికైన వారు పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ నేర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

News September 10, 2024

గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి

image

గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. హవేలీఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ తండాకు చెందిన రామావత్ వస్రాం(40) మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఏజెంట్ ద్వారా గత నెల10న కూలి పని కోసం దుబాయ్ వెళ్ళాడు. నిన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాగా మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట్ల సూర్య కూడా ఈనెల 1న అబుదాబిలో మరణించగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.

News September 10, 2024

MDK: టాస్కులు, కమీషన్ పేరుతో భారీ మోసం

image

సైబర్ మోసంలో టెకీ రూ.లక్షలు పోగొట్టుకున్న ఘనట అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. జన్మభూమి కాలనీ ఫేస్-2కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టాస్కులు, కమీషన్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఉద్యోగి తన వివరాలు నమోదు చేయగా టాస్కులు పూర్తి చేస్తే పెట్టిన నగదుతోపాటు కమీషన్ వస్తుందని నమ్మించారు. ఉద్యోగి పలు దఫాలుగా రూ.15.82లక్షలు వేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించ లేదు.