News July 30, 2024

నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: డిప్యూటీ సీఎం పవన్

image

వన్య ప్రాణులు, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో అలుగును అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అధికారులపై దాడి జరిగిన ఘటనపై మంగళవారం ఆయన ఆరా తీశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Similar News

News February 15, 2025

గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం: సీఎం

image

సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో సేవాలాల్‌కు నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ.. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమాలు అమలు చేశారన్నారు. ఆయన స్పూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామన్నారు.

News February 15, 2025

తాడికొండలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

తాడికొండ మండల పరిధిలోని బేజాత్ పురం గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి (70) మృతదేహం లభ్యమైంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘటనా స్థలానికి ఎస్ఐ జైత్యా నాయక్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రవిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసినవారు తాడికొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

News February 15, 2025

తెనాలి: కత్తితో దాడి.. వ్యక్తి మృతి

image

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తెనాలి నాజరుపేటకు చెందిన గొంది బసవయ్యపై ఇస్లాంపేటకు చెందిన జూపల్లి వేణు, అతని స్నేహితుడు రాము కత్తితో గొంతుపై దాడి చేసిన విషయం తెలిసిందే. గత నెల 31న ఈ ఘటన జరుగగా బసవయ్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అప్పట్లో బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బాధితుడి మృతితో కేసును హత్య కేసుగా మార్చారు.

error: Content is protected !!