News November 14, 2024

నిందితుల వేలిముద్రలను సేకరించండి:SP

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలన్నారు. 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అన్ని కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల వేలిముద్రలను లైవ్ స్కానర్లలో తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News November 15, 2024

తగరపువలస గోస్తనీ నదిలో కారు బోల్తా.. డ్రైవర్ మృతి

image

తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెన‌పై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్‌ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

News November 15, 2024

విజయనగరంలో టుడే టాప్ న్యూస్

image

>స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రద్దు > విజయనగరంలో గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం > బాల్యవివాహాలు చేస్తే సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ వకుల్ జిందాల్ > నటుడు పోసానిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు > బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవం>కొండగుంపాంలో ఇంటి పైనుంచి జారిపడి మహిళ మృతి > పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం

News November 14, 2024

VZM: స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌‌ల నియామకం 

image

జిల్లా జ్యుడీషియల్ పరిధిలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. బార్‌లో నాన్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా ఉంటూ 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వారంలో ఐదు రోజులపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.