News January 13, 2025
నిఘా నీడలో ఇంటర్ ప్రయోగ పరీక్షలు

ఉమ్మడి జిల్లాలో జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే నెల 3 నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో డిపార్ట్మెంటల్ అధికారుల ప్రమేయం లేకుండా ఈ సారి పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News February 10, 2025
WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
News February 10, 2025
NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News February 10, 2025
మన్యంకొండ వెంకటేశ్వర స్వామి హంస వాహన సేవ

పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు మాఘశుద్ధ ద్వాదశి ఆదివారం రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరించారు. సతీ సమేతంగా హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞాన సిద్ధి, బ్రహ్మ పాద ప్రాప్తి కలిగించేందుకు స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.