News December 31, 2024

నిఘా నీడలో విశాఖ..!

image

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా రద్దీగల ప్రాంతాలతో పాటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, అడవివరం, బీఆర్డీఎస్ రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాలలో నిఘా పెంచారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను పహారా పెట్టారు.

Similar News

News December 13, 2025

నేడు AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం

image

AU పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం ‘వేవ్స్–2025’ను మహిళా సాధికారత థీమ్‌తో శనివారం నిర్వహించనున్నారు. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధా మూర్తి, ఏయూ ఆలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు, GMR అధినేత జి.ఎం.రావు తదితరులు పాల్గొననున్నారు.

News December 12, 2025

విశాఖ నుంచి తిరుగుపయనమైన సీఎం

image

ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం చంద్ర‌బాబు విశాఖకు శుక్రవారం వచ్చారు. విశాఖలో పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై, పలు కంపెనీలకు మంత్రులు, అధికారులతో శంకుస్థాపన చేపట్టారు. అనంతరం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తిరుగు పయనమయ్యారు. ఆయనకు ఎయిర్ పోర్ట్‌లో కూటమి నాయకులు, అధికారులు ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు.

News December 12, 2025

అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

image

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.