News May 12, 2024
నిజాంపట్నంలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

మండలంలోని అచ్చుతపురం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పెనుమూడి నుంచి నిజాంపట్నం వెళుతున్న బైకును టాటా మ్యాజిక్ ఢీకొట్టడంతో కొక్కిలిగడ్డ శివకృష్ణ అనే వ్యక్తి మృతిచెందాడు. కొక్కిలిగడ్డ నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం

మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ పని కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి మే 14లోగా ఆర్ఎఫ్పీలు (ప్రతిపాదనలు) కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం నిర్మాణంతో పాటు అక్కడి ప్రధాన రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ డిజైన్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.
News April 22, 2025
పెదకూరపాడు: సివిల్స్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ

పెదకూరపాడుకు చెందిన సామాన్య రైతు బిడ్డ చల్లా పవన్ కళ్యాణ్ సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించాడు. పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించినట్లు పవన్ తెలిపాడు. పవన్ విజయం జిల్లాకే గర్వకారణమని స్థానికులు కొనియాడారు. మంచి ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News April 22, 2025
గుంటూరు వాహినిలో 25 వరకు తాగునీటి విడుదల

గుంటూరు జిల్లా తాగునీటి చెరువులను నింపాలని గుంటూరు వాహినికి ఈ నెల 25 వరకు తాగు నీటిని విడుదల చేస్తున్నామని, ఆయా తటాకాలను నీటితో నింపుకోవాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఉప్పుటూరి సాంబశివరావు తెలిపారు. 25వ తేదీ తర్వాత మరమ్మతుల నిమిత్తం కాలువకు నీరు నిలిపివేస్తామని, రాబోయే రోజులలో పెదనందిపాడు మండల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.