News May 12, 2024
నిజాంపట్నంలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

మండలంలోని అచ్చుతపురం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పెనుమూడి నుంచి నిజాంపట్నం వెళుతున్న బైకును టాటా మ్యాజిక్ ఢీకొట్టడంతో కొక్కిలిగడ్డ శివకృష్ణ అనే వ్యక్తి మృతిచెందాడు. కొక్కిలిగడ్డ నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2025
విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

10వ తరగతి పరీక్షల విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం, కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.
News February 17, 2025
గుంటూరు: రూ.11లక్షల విలువ గల బైక్‌లు స్వాధీనం

పట్టాభిపురం, చేబ్రోలు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులకు సంభందించి రూ. 11లక్షల విలువ గల ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. 2.24 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. వాటిని ఎస్పీ సతీశ్ కుమార్ మీడియా ముందు ఉంచారు. పార్కింగ్ చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీసి దొంగతనం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
News February 17, 2025
GNT: కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో RTC బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.