News January 1, 2025

నిజాంపట్నం: భర్తను హత్య చేసిన భార్య

image

భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

BREAKING: బస్సులు ఢీ.. గుంటూరు వాసులు మృతి

image

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వెళ్తుండగా SV కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 18, 2025

అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు: కలెక్టర్ 

image

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం, కలెక్టరేట్ నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి నెల 3శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు.

News January 17, 2025

ఎస్ఐపై చర్యలు తీసుకుంటాం: GNT ఎస్పీ

image

పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశ్ రావు, ఎస్ఐ రాజ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వాదంపై విచారణ జరుగుతోందని, న్యాయవాదులు గుర్తించి తమ శాఖకు సహకరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఘటన జరిగిన రోజు నుంచే రాజ్ కుమార్‌ని వీఆర్‌కు పంపించి డీఎస్పీతో విచారణ చేయిస్తున్నామన్నారు. ఎంక్వైరీ ఆధారంగా ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్నారు.