News March 19, 2025
నిజాంపేట: తల్లిదండ్రులు మందలించడంతో యువకుడి సూసైడ్ UPDATE

నిజాంపేట మండలం కేంద్రానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గరుగుల భాను(18) ఇంటర్మీడియట్లో ఫెయిల్ కావడంతో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన భాను మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 20, 2025
మెదక్: పారదర్శక పాలనే లక్ష్యం: కలెక్టర్

పారదర్శక రెవిన్యూ పాలనే లక్ష్యంగా సంబంధిత తహశీల్దార్లు జవాబు దారితనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు అన్ని మండలాల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరిండెంటెంట్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో కలిసి పెండింగ్ ప్రజావాణి సమస్యలు, ధరణి సమస్యలపై సమీక్షించారు.
News March 20, 2025
MDK: సీఎం రేవంత్, మంత్రిని కలిసి ఎస్సీ నేతలు

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మాదిగ, మాదిగ ఉప కులాల సంఘాల నాయకులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదరను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దశాబ్దాల కల నెరవేరిందని షెడ్యూల్డ్ కులాల ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని మంత్రి అన్నారు.
News March 19, 2025
మెదక్ జిల్లాలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

చిన్నశంకరంపేట మండలం మడూరు శివాలయం వద్ద అద్భుతంగా చెక్కిన రాష్ట్రకూట, కళ్యాణిచాళుక్య, కాకతీయ శైలుల శిల్పాలు లభించాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. కళ్యాణి చాళుక్య శైలిలో ఆభరణాలతో చెక్కిన యోగశయనమూర్తి విగ్రహం యోగముద్రలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శిల్పం ద్వారపాలకులు, అష్టభుజ మహిషాసురమర్ధిని, సరస్వతీ దేవి విగ్రహం, చతుర్భుజ విష్ణు విగ్రహాలు ఉన్నాయన్నారు.