News March 12, 2025

నిజాంపేట: వెంకటేశ్‌కు రాష్ట్రపతి చేతులమీదుగా బంగారు పతకం

image

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్‌కు చెందిన గోపిక వెంకటేశ్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబీశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రింటింగ్, ప్యాకేజ్ ప్యాకేజ్‌లో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News March 19, 2025

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర్ కామెంట్స్

image

ఎస్సీ వర్గీకరణ హేతు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇదో చారిత్రాత్మకమైన రోజు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వివక్షను రూపుమాపేందుకు తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును తెచ్చామని మంత్రి వెల్లడించారు.

News March 19, 2025

మెదక్‌లో తల్లీకూతురు మిస్సింగ్.. కేసు నమోదు

image

మెదక్ పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన చెందిన ఎం. విజయలక్ష్మి(54) తన కూతురు ఎం. మణిదీపిక (27)లు సోమవారం మిస్ అయ్యారు. మెదక్‌లోని వారి ఇంట్లో నుంచి వెళ్లిన వీరు ఇద్దరూ కనిపించట్లేదని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే 8712657878, 8712657913 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 19, 2025

మెదక్: భట్టి బడ్జెట్‌లో వరాలు కురిపిస్తారా..!

image

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మెతుకుసీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి కేటాయింపులపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నీటిని అందించే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో జాప్యం, పెండింగ్ పనులు, విద్యా, వైద్య రంగాల్లో అనిశ్చితి తొలిగేలా జిల్లాలో చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

error: Content is protected !!